• Login / Register
  • Bc Dedication Commission | బీసీ కుల‌గ‌ణ‌న‌కు డిడికేష‌న్ క‌మిష‌న్ ఏర్పాటు చేయండి

    Bc Dedication Commission | బీసీ కుల‌గ‌ణ‌న‌కు డిడికేష‌న్ క‌మిష‌న్ ఏర్పాటు చేయండి
    అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి
    స‌మావేశంలో పాల్గొన్న మంత్రులు ఉత్త‌మ్‌, రాజ‌న‌ర‌సింహా, శ్రీ‌ధ‌ర్‌బాబు

    Hyderabad : రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే హైకోర్టు తీర్పున‌కు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. సోమ‌వారం లోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని స్ప‌ష్టం చేశారు. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లో  సోమ‌వారం లోగా కోర్టు ఉత్తర్వుల మేరకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాల‌న్న ఆదేశాల మేర‌కు వెంట‌నే ప్ర‌భుత్వ అధికారులు ఆ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ మేర‌కు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహా, మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబుత పాటు బీసీ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, టీపీసీసీ ప్రెసిడెంట్ మ‌హేష్‌కుమార్ గౌడ్ తోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 
    *  *  * 

    Leave A Comment